పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం... కుటుంబం ఆత్మహత్య!

  • వీరిశెట్టిగూడెంలో ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం
  • కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న కుటుంబం
  • మణికంఠ (12) అన్నపూర్ణ (11) లావణ్య (5) మృతి 
పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెంలో ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. నలుగురు కుటుంబ సభ్యులు గల ఇంట్లో తెల్లవారు జామున మంటలు ఎగసిపడ్డాయి. వాటిని గుర్తించిన స్థానికులు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఇల్లంతా మంటలు అలముకున్నాయి. దీంతో కుటుంబ సభ్యులంతా వాటిలో చిక్కుకుని తగులబడిపోయారు.

వీరిలో మణికంఠ (12), అన్నపూర్ణ (11), లావణ్య (5) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలతో వున్న వారి తల్లిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. కాగా, వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
Go Back to Shorts
sucide
family
west godavari

More Telugu News